Bhatti Vikramarka : దొరల రాజ్యం దొంగల పెత్తనం – భట్టి
నిప్పులు చెరిగిన సీఎల్పీ నేత
Bhatti Vikramarka : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఆయన బీఆర్ఎస్ సర్కార్ ను, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో ఒక మాట, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడటం దొరకే చెల్లిందన్నారు. ప్రస్తుతం దొరల పెత్తనం , దొంగల రాజ్యం నడుస్తోందన్నారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు , పనుల పేరుతో దోపీడికి అంతు లేకుండా పోయిందని మండిపడ్డారు మల్లు భట్టి విక్రమార్క.
కేసీఆర్ పదే పదే చెబుతున్న బంగారు తెలంగాణ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కార్యక్రమం నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) యాత్రలో మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు మల్లు. దళిత బంధు పేరుతో మోసం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. పేదింటి ఆడపిల్లల పరిస్థితి దారుణంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. ఎవరిని ఉద్దరించేందుకు టీ హబ్ లు, వీ హబ్ లు, విమెన్ ఎంపవర్ మెంట్ లు అంటూ నిలదీశారు . ఎంత మంది దళితులను ఉద్దరించారో చెప్పాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క.
Also Read : Arvind Kejriwal : మోదీ నిర్వాకం రైల్వే వ్యవస్థ నాశనం