Nara Lokesh : విద్యకు ప్రాధాన్యం అభివృద్దికి సోపానం
ఫీజు రీయంబర్స్మెంట్ ను రద్దు చేస్తాం
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేపట్టిన యువ గళం పాదయాత్ర ఆదివారం నాటితో 130వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే నారా లోకేష్ 1600 కిలోమీటర్లకు పైగా నడిచారు. ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. తాము పవర్ లోకి రాగానే విద్యా రంగానికి ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. ఆయా కాలేజీలను కంపెనీలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. దీని వల్ల చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగం దొరకదేమోనన్న ఆందోళన ఉండదన్నారు నారా లోకేష్(Nara Lokesh).
ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ఫీజు రీయంబర్స్ మెంట్ ను రద్దు చేస్తామన్నారు. దాని స్థానంలో పాత విధానాన్నే తిరిగి తీసుకు వస్తామని ప్రకటించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆయా కళాశాలలో కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తామని చెప్పారు నారా లోకేష్. ఏ రంగంలోకి వెళితే ఎలాంటి అవకాశాలు ఉంటాయనే దానిపై వీరి ద్వారా క్లారిటీ వస్తుందన్నారు.
Also Read : Bhatti Vikramarka : దొరల రాజ్యం దొంగల పెత్తనం – భట్టి