Bhagwant Mann : సీఎం కావడాన్ని త‌ట్టుకోలేక పోయారు

భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న కామెంట్స్

Bhagwant Mann : పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఎవ‌రైనా త‌మ స‌మాజంలో అత్యున్న‌త స్థానానికి చేరుకుంటే సంతోషిస్తార‌ని కానీ పంజాబ్ లో కొలువు తీరిన ప్ర‌తిప‌క్ష పార్టీలు, అధినేత‌లు త‌న విజ‌యాన్ని చూసి త‌ట్టుకోలేక పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు భ‌గ‌వంత్ మాన్.

పంజాబ్ లో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఆప్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు మాన్. ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించార‌ని చెప్పారు పంజాబ్ సీఎం. త‌న జీవితంలో మ‌రిచి పోలేనిది ఏదైనా ఉందంటే అది న‌ట‌న‌, ఎంపీ కావ‌డం, ఆ త‌ర్వాత నా మాతృభూమి క‌లిగిన పంజాబ్ కు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వ‌హించ‌డ‌మ‌ని పేర్కొన్నారు భ‌గవంత్ మాన్(Bhagwant Mann).

సుఖ్ బీర్ బాద‌ల్, ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ , ఆయ‌న బావ‌, అల్లుడు, మాజీ సీఎం చ‌న్నీ , కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్, న‌వ్ జ్యోత్ సింగ్ సిద్దూ ఇలా అతిర‌థ మ‌హార‌థులు శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. పంజాబ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్థానాలు గెలిచిన చ‌రిత్ర త‌మ ఆప్ పార్టీకే ఉంద‌న్నారు సీఎం. ఎన్నో ర‌కాలుగా అవ‌మానాలు ఎదుర్కొన్నాన‌ని అన్నారు. కానీ అంతిమ విజ‌యం నిరీక్షించిన త‌ర్వాత ద‌క్కింద‌ని చెప్పారు భ‌గ‌వంత్ మాన్.

Also Read : RS Praveen Kumar : కేసు ఎత్తివేత‌పై కుల ప్ర‌భావం – ఆర్ఎస్పీ

 

Leave A Reply

Your Email Id will not be published!