CM DK Shiva Kumar : సీఎం కుర్చీపై భిన్నాభిప్రాయాలు
కన్నడ నాట కొనసాగుతున్న వివాదం
CM DK Shiva Kumar : కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎంగా పూర్తి కాలం ఉండాలనే దానిపై ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది ఆ పార్టీ అధిష్టానం. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించని రీతిలో ఏకపక్షంగా అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చింది. పవర్ లో ఉన్న కాషాయ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. గతంలో రాష్ట్రంలో నీరుగారి పోయి నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు కర్ణాటక పీసీసీ చీఫ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లుగా గెలుపొందిన నలుగురు సైతం ఆ పార్టీకే మద్దతు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పూర్తి సంఖ్య 139కి చేరింది. బీజేపీ 65తో సరి పెట్టుకోగా చక్రం తిప్పాలని ఆలోచించిన జేడీఎస్ 19కి పరిమితమైంది. ఇదిలా ఉండగా సీఎం గా సిద్దరామయ్య వర్సెస్ డీకే శివకుమార్(DK Shiva Kumar) మధ్య తీవ్ర పోటీ నడిచింది. చివరకు క్లీన్ ఇమేజ్ కలిగిన సిద్దరామయ్య వైపు కాంగ్రెస్ మొగ్గింది. అయితే సీఎం పదవిని ఇద్దరూ చెరి సమానంగా పంచుకుంటారని స్పష్టం చేసింది పార్టీ.
కాగా తాజాగా అధికారం పంచు కోవడంపై కర్ణాటక కాంగ్రెస్లో విభేదాలు మరింత ముదురుతున్నట్లు సమాచారం. కేబినెట్ లో కొలువు తీరిన మంత్రులు ఎంబీ పాటిల్ , హెచ్ సీ మహదేవప్ప, సతీష్ జార్కి మోళీ సిద్దరామయ్య 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేయడం కలకలం రేపింది. డీకే సోదరుడు డీకే సురేష్, మరికొంత మంది మంత్రులు రాబోయే 2 ఏళ్లలో డీకే శివకుమార్ ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారు.
Also Read : PM Modi Tour : బైడన్ ఆహ్వానం మోదీ పయనం
