Pawan Kalyan Deeksha : ప్రజా సంక్షేమం కోసం ప‌వ‌న్ దీక్ష

కార్తీక మాసం దాకా కొన‌సాగింపు

Pawan Kalyan Deeksha : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేశారు. వారాహి ప్రజా యాత్రను ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్న‌ట్టుండి జ‌నం కోసం వారి సంక్షేమం కోసం తాను ఉపవాస దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. వారాహి అమ్మ వారి న‌వ రాత్రులు అనంత‌రం చాతుర్మాస దీక్ష ఉండ‌టంతో మంగ‌ళ‌వారం నుండి కార్తీక మాసం వ‌ర‌కు ఉపవాస దీక్షకు దిగ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే పెద్ద ఎత్తున జ‌న‌సైనికులు మ‌ద్ద‌తు తెలిపారు. తాము కూడా త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఉప‌వాస దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండగా న‌టుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఆయ‌న గ‌త కొన్నేళ్ల కింద‌ట జ‌న‌సేన పార్టీని స్థాపించారు. ఏపీ రాష్ట్రానికి మెరుగైన పాల‌న అందించ‌డమే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో గ‌తంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచినా ఆశించిన మేర ఫ‌లితాలు రాలేదు. కానీ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

ఇప్ప‌టికే టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ఆయ‌న త‌న‌యుడు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ బాబు సైతం యువ గ‌ళం పాద‌యాత్ర‌ను చేప‌ట్టారు. బీజేపీ స‌భ‌ల‌తో హోరెత్తిస్తోంది. ఇక వైసీపీ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేస్తోంది.

Also Read : Satya Pal Malik Modi : మ‌ణిపూర్ హింస‌పై మోదీ మౌనం

 

Leave A Reply

Your Email Id will not be published!