Arvind Kejriwal : ఎల్జీ నిర్వాకం సీఎం ఆగ్రహం
సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కేంద్రం కావాలని తమతో రాజకీయం చేస్తోందని ఆవేదన చెందారు. ఇప్పటికే కొత్తగా ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందని దానిని సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.
15 రోజుల కిందట ఒక ఫైల్ తన వద్దకు వచ్చిందన్నారు. ఇందులో ఒక అధికారిని సస్పెండ్ చేయాలని కోరారని, నేను ఫైల్ పై మూడు నాలుగు ప్రశ్నలు వేసి రాశానని, తిరిగి ఫైల్ ను పంపించానని తెలిపారు. కానీ ఇప్పటి వరకు నాకు ఆ ఫైల్ తిరిగి రాక పోగా నేరుగా ఎల్జీకి పంపించారని ఆరోపించారు. చివరకు సదరు అధికారిని ఎల్జీ సస్పెండ్ చేశారంటూ నిప్పులు చెరిగారు. ఈ విషయాలను ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని చెప్పారు.
ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం అనుసరిస్తున్న కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని సూచించారు. పార్లమెంట్ లో గనుక బిల్లు వస్తే కచ్చితంగా వీగి పోవడం ఖాయమని స్పష్టం చేశారు సీఎం. ఇకనైనా మోదీ , బీజేపీ సంకీర్ణ సర్కార్ ప్రజాస్వామ్య బద్దంగా పాలిస్తే బెటర్ అని లేక పోతే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
Also Read : DK Shiva Kumar : ‘అన్నభాగ్య’ను అడ్డుకుంటే ఊరుకోం