AP Students YS Jagan : జగన్ కు స్టూడెంట్స్ జేజేలు
సారు వల్లనే చదువుకున్నాం
AP Students YS Jagan : ఏపీ సీఎం జగన్ రెడ్డికి స్టూడెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలలో టాప్ లో నిలిచి, ప్రతిభను కనబర్చిన విద్యార్థులను ప్రత్యకంగా అభినందించారు జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా విద్యార్థినులు సీఎంకు జేజేలు పలికారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ మేం ఈ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు.
గతంలో బడులు అస్తవ్యస్తంగా ఉండేవని, కానీ ఎప్పుడైతే జగన్ సీఎంగా కొలువు తీరారో ఆనాటి నుంచి రాష్ట్రంలో స్కూళ్ల పరిస్థితి పూర్తిగా మారి పోయింది. సమూలమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విప్లవాత్మకమైన చర్యలు చేపట్టారు. నాడు నేడు కార్యక్రామాన్ని అమలు చేశారు. దీని వల్ల ప్రతి పల్లెలో బడులు క్యాంపస్ లను తలపింప చేస్తున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఇవాళ ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎక్కడా రాజీ పడలేదు. ప్రపంచంతో పోటీ పడేందుకు ఏపీ విద్యార్థులు గ్లోబల్ లీడర్స్ కావాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan). ఈ మేరకు తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో పిల్లలకు చదువు చెప్పాలని సూచించారు.
అంతే కాదు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చేలా చేశారు. మొత్తంగా సీఎం తీసుకున్న నిర్ణయాలు ఇవాళ విద్యార్థులకు అంది వచ్చిన అవకాశాలుగా మారాయి. అవార్డుల ప్రధానోత్సవంలో ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : AP CM YS Jagan : విద్యా కుసుమాలు ఆణిముత్యాలు – జగన్