CM KCR Wishes Vijay : విజ‌య్ కి కేసీఆర్ విషెస్

పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

CM KCR Wishes Vijay : ద‌క్షిణాదిన మోస్ట్ పాపుల‌ర్ న‌టుడిగా పేరు పొందిన త‌ల‌ప‌తి విజ‌య్ పుట్టిన రోజు ఇవాళ‌. ఆయ‌న‌కు 49 ఏళ్లు. ఈ సంద‌ర్బంగా దేశ వ్యాప్తంగా సినీ, రాజ‌కీయ‌, వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు.

గురువారం భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు త‌ల‌ప‌తి విజ‌య్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. కెరీర్ ప‌రంగా మ‌రింత‌గా ఎద‌గాల‌ని , ఆయు రారోగ్యాల‌తో ఆనందంగా ఉండాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా గ‌తంలో న‌టుడు విజ‌య్ స్వ‌యంగా సీఎం కేసీఆర్(KCR) ను క‌లుసుకున్నారు. ఆయ‌న‌తో వివిధ అంశాల‌పై ముచ్చ‌టించారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు కూడా నాటారు విజ‌య్. కాగా త‌మిళ‌నాడు రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన న‌టుడిగా గుర్తింపు పొందారు. ఇటీవ‌లే ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై. 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ ఎందుక‌నో ఆయ‌న రాలేదు. అప్ప‌టి అన్నాడీఎంకే, బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ పై సెటైర్లు వేశారు. ఆ వెంట‌నే ఎన్నిక‌ల సంద‌ర్భంగా సైకిల్ పై వెళ్లి ఓటు వేశారు. త‌న అభిమానులంద‌రినీ డీఎంకేకు ఓటు వేయాల‌ని చెప్ప‌క‌నే చెప్పారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా విద్యార్థుల‌ను ఉద్దేశించి అంబేద్క‌ర్, పెరియార్ , కామ రాజ్ ను చ‌ద‌వాల‌ని కోరారు.

Also Read : RS Praveen Kumar KCR : అమ‌రుల కుటుంబాల‌కు గుర్తింపేది

 

Leave A Reply

Your Email Id will not be published!