CM KCR : డబుల్ బెడ్రూం ఇళ్లతో ఆత్మ గౌరవం
స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
CM KCR : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఆత్మ గౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సొంతింటి కలను నెరవేర్చిన ఘనత తమ సర్కార్ కే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో పేదలకు ఇళ్లను కట్టించి ఇస్తున్నామని చెప్పారు. కొందరు మాటలు చెబుతారని , కాలం వెళ్ల దీస్తారని కానీ తాను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టేనని అన్నారు కేసీఆర్(KCR).
మాట ఇచ్చానంటే చేసి చూపిస్తానని ఇదిగో మీ కళ్ల ముందున్న డబుల్ బెడ్రూం ఇళ్లు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. సోయి లేనోళ్లు ఎన్నో మాట్లాడతారని రంగంలోకి దిగితే తెలుస్తుందన్నారు ఎవరి సత్తా ఏమిటో..ఏపాటిదోనని సీఎం.
ఇదిలా ఉండగా రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇళ్ల నిర్మానాన్ని. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో భారీ ఎత్తున డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించింది. ఇందు కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసింది ప్రభుత్వం. పేదలకు వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోంది.
ఇది రాష్ట్ర చరిత్రలో ఓ రికార్డుగా మిగిలి పోతుందని సీఎం కేసీఆర్. 15 వేల 660 డబుల్ బెడ్ రూమ్ ల గృహ సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. టౌన్ షిప్ ను సందర్శించారు. అనంతరం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు సీఎం.
Also Read : CM YS Jagan : నాలుగు కంపెనీల నిర్మాణానికి శ్రీకారం