Janasena Party : మలికిపురం జనసేన సభ వాయిదా
అనివార్య కారణాల వల్ల రద్దు
Janasena Party : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో చేపట్టిన వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. కాగా శనివారం మలికిపురంలో భారీ సభను నిర్వహించాలని తలపెట్టింది జనసేన పార్టీ(Janasena Party). అయితే భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో అర్ధాంతరంగా మీటింగ్ ను వాయిదా వేసినట్లు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరి ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా జన సేనాని సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయాన్ని అధ్యక్షుడు తీసుకున్నారని స్పష్టం చేశారు.
రేపటి వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటాని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఇవాళ పార్టీ చీఫ్ పొలిటికల్ కార్యదర్శి వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ఆయన కోరారు. మరో వైపు పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేనంతగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఆయన ప్రధానంగా అధికారంలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వాన్ని, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, మంత్రులను , ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారు.
సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సీఎంను చేయాలని, ప్రజా రంజక పాలనను అందజేస్తానని హామీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్.
Also Read : TSPSC GROUP- 4 Hall Tickets : గ్రూప్ – 4 హాల్ టికెట్లు రెడీ