Tirumala Rush : భక్తుల రద్దీతో తిరుమల కిటకిట
72,304 మంది భక్తుల దర్శనం
Tirumala Rush : వేసవి సెలవులు ముగిసినా తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు తగ్గడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తుల తాకిడిని ముందుగానే గమనించిన టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు చర్యలకు ఆదేశించారు. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని రేయింబవళ్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
రోజు రోజుకు ఆ దేవ దేవుడిని కొలిచేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి దర్శనం కోసం వస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజు స్వామి వారిని 72,304 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తలనీలాలు సమర్పించుకునే వారి సంఖ్య కూడా పెరగడం గమనార్హం. ఇక నిన్నటి ఒక రోజే తిరుమల స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) స్పష్టం చేసింది.
ఇక నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చేస్తోంది దేవస్థానం. ఇదే సమయంలో ఎలాంటి టోకెన్లు లేకుండా శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ లను దర్శించుకునే భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి సంబంధించి స్వామి వారి దర్శనానికి కనీసం 18 గంటల సమయం పట్ట వచ్చని తెలిపింది టీటీడీ.
Also Read : Janasena Party : మలికిపురం జనసేన సభ వాయిదా