Pawan Kalyan : జగన్ ప్రభుత్వం ప్రజలకు శాపం – పవన్
ఏపీ సర్కార్ పనితీరు దారుణం
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీలో వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మలికిపురంలో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు జనసేన(Janasena) పార్టీ చీఫ్. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. పులివెందుల అరాచకం కొనసాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇంకానా ఇకపై చెల్లదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.
సాండ్, ల్యాండ్ మాఫియా చెలరేగుతోందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించు కోవడం లేదని ధ్వజమెత్తారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ఏపీ సర్కార్ కే దక్కుతుందన్నారు. దోపిడీకి, అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.
రాష్ట్రానికి చెందిన వనరులన్నింటినీ గంప గుత్తగా తమ వారికి అప్పగించే పనిలో జగన్ బిజీగా ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. పాలనా పరంగా ప్రభుత్వం జవాబుదారీగా ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించి ఎన్ని పరిశ్రమలు తీసుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే ఆగడాలను జన సైనికులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
అప్పులు తీసుకు రావడంలో ఉన్నంత శ్రద్ధ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు యత్నించడం లేదంటూ ధ్వజమెత్తారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని , రాబోయే రోజుల్లో జనసేనకు పట్టం కట్టడం ఖాయమన్నారు.
Also Read : Sarfaraz Khan BCCI : సర్ఫరాజ్ ఖాన్ ప్రవర్తన సరిగా లేదు
