VES Solar System : వీఈఎస్ క్యాంపస్ మొత్తం సౌర విద్యుత్
గ్రీన్ క్యాంపస్ గా మార్చేందుకు ప్రయత్నం
VES Solar System : ముంబై యూనివర్శిటీ లో పేరొందిన కాలేజీలలో వీఈసీ కాలేజ్(VES College) ఒకటి. ఈ కళాశాలకు చెందిన విద్యార్థులు వినూత్నమైన ఆలోచనలకు పదును పెట్టారు. ఇందులో భాగంగా వంద శాతం కాలేజీ క్యాంపస్ ను పూర్తిగా సౌర విద్యుత్ తో మార్చేందుకు ప్రయత్నించారు. వంద శాతం రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తికి మార్చేందుకు, గ్రీన్ క్యాంపస్ గా అనేక స్థిరమైన పద్దతులను అవలంభిస్తోంది. ఇది వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ తన క్యాంపస్ ను పూర్తిగా సౌర శక్తిని, స్థిరమైన పద్దతులను అవలంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సాహసోపేతమైన దశ స్థిరత్వం పట్ల వీఎస్ తిరుగులేని నిబద్దతను తెలియ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విద్యా సంస్థలకు కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. క్యాంపస్ అంతటా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సోలార్ టెక్నాలజీని ఇన్ స్టాల్ చేస్తుంది. ఈ చర్య వల్ల సాంప్రదాయక ఇంధన వనరులపై కాలేజీ ఆధార పడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో గణనీయమైన తగ్గింపునకు దారి తీసే బిల్లులను తగ్గిస్తుంది.
గ్రీన్ క్యాంపస్ చొరవలో భాగంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ , వాటర్ ఎఫెక్టివ్ ఫిక్చర్స్ , ఇతర పర్యావరణ అనుకూల పద్దతులలో శక్తి సమర్థవంతమైన లైటింగ్ సిస్టమ్ లను అమలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ సమయానికి అన్ని నివారించదగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను తొలగిస్తుంది. ప్లే గ్రౌండ్ లో మియావాకి ఫారెస్ట్ ను సృష్టించేందుకు ప్లాన్ చేసింది. కుర్లా, చెంబూర్ లోని ఇతర క్యాంపస్ ప్లే గ్రౌండ్ లలో కొనసాగించాలని భావిస్తోంది వీఈఎస్.
Also Read : Etela Rajender : కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే – ఈటల