Rahul Gandhi Jawan : మణిపూర్ లో జవాన్ల కృషి భేష్
సైనికులను కలిసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Jawan : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడ జాతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి దాకా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చంపేస్తారేమోనన్న భయంతో మణిపూర్ ను విడిచి పెట్టారు.
ఇతర ప్రాంతాల్లో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. ఈ తరుణంలో భరోసా ఇవ్వాల్సిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సర్కార్ వారిని పట్టించు కోలేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో బాధితులను పరామర్శిస్తున్నారు.
ఇదే సమయంలో అల్లర్లను కంట్రోల్ చేస్తూ, మణిపూర్ లో ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడనీయకుండా జవాన్లు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. దాదాపు 10 వేల మందికి పైగా రాష్ట్రంలో మోహరించారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఈ సందర్భంగా రేయింబవళ్లు శ్రమకోర్చి విధులు నిర్వహిస్తున్న సైనికులను, జవాన్లను ప్రత్యేకంగా కలుసుకున్నారు రాహుల్ గాంధీ.
వారిని పేరు పేరునా పలకరించారు. వారిని అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి గౌరవ సూచకంగా ఓ జవాన్ సెల్యూట్ చేయడం అక్కడ ఉన్న వారిని విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ వారికి పూర్తి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
Also Read : PM Modi Travels : మెట్రోలో ప్రయాణించిన మోదీ