Ponguleti Srinivas Reddy : నా సత్తా ఏమిటో చూపిస్తా
మాజీ ఎంపీ పొంగులేటి
Ponguleti Srinivas Reddy : ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభలో తన సత్తా ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ యాత్ర ఇవాల్టితో ముగుస్తుంది. ఇందుకు సంబంధించి ముగింపు పేరుతోనే సభ చేపట్టారు. దీనికి జన గర్జన సభ అని పేరు పెట్టారు.
ఈ సభకు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మంకు చేరుకున్నారు. సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని , అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఆ మేరకు పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది.
జన గర్జన సభపై కీలక కామెంట్స్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). గతంలో ఎన్నడూ లేనంతగా జనాన్ని తరలించాలని తాను డిసైడ్ అయ్యానని చెప్పారు. ఈ ఒక్క సభ తానేమిటో, తనకు ఉన్న బలం ఏమిటో, బలగం ఏమిటో చూపిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవన్నారు. పార్టీని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జనం కేసీఆర్ నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Also Read : PM Modi : నీరజ్ చోప్రాకు మోదీ ప్రశంస
