Vasireddy Padma : 5న ఏపీ మ‌హిళా క‌మిష‌న్ స‌ద‌స్సు

సోషల్ మీడియాలో మ‌హిళ‌ల‌పై దాడులు

Vasireddy Padma : ఆంధ్ర ప్ర‌దేశ్ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఆమె గ‌త కొంత కాలం నుంచి సామాజిక మాధ్య‌మాల‌పై ఫోక‌స్ పెట్టారు. ప్ర‌ధానంగా ఎక్కువ‌గా మ‌హిళ‌లు, యువ‌తులు, వివాహితులు , బాలిక‌లు దారుణంగా ట్రోల్ కు గుర‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు ప‌ట్ల జుగుస్సాక‌ర‌మైన రీతిలో కామెంట్స్ పెట్ట‌డాన్ని కూడా గుర్తు చేశారు. ఇదిలా ఉండ‌గా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌.

జూలై 5న ఆంధ్ర ప్ర‌దేశ్ మ‌హిళా క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలో సోష‌ల్ మీడియాలో మ‌హిళ‌ల‌పై దాడులు..నివార‌ణా మార్గాలు అనే అంశంపై స‌ద‌స్సును ఏర్పాటు చేశారు. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు. వ్య‌క్తిత్వాన్ని కించ ప‌రిచేలా చేయ‌డం, వ్య‌వ‌స్థాగ‌తంగా చుల‌క‌న చేయ‌డం, సామాజిక ప‌రంగా ఇబ్బందికి గురి చేసేలా వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు తెలిపారు వాసిరెడ్డి ప‌ద్మ‌(Vasireddy Padma).

ఇందులో భాగంగా సోష‌ల్ మీడియాపై ప‌ట్టు క‌లిగిన వారిని, నిపుణుల‌ను, సామాజిక‌వేత్త‌ల‌ను, మేధావుల‌ను ఈ స‌ద‌స్సుకు రావాల్సిందిగా కోరారు. ఇదే స‌మ‌యంలో ఎవ‌రైనా ఆస‌క్తి క‌లిగిన వారు ఇందులో పాల్గొనవ‌చ్చు. బాధితుల‌కు కూడా చెప్పుకునేందుకు ఇది ఓ వేదిక‌గా ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఆశిద్దాం. ఈ స‌ద‌స్సు విజ‌య‌వాడ‌లో జ‌రుగుతుంద‌ని పేర్కొంది ఏపీ మ‌హిళా క‌మిష‌న్.

Also Read : DK Shiva Kumar : శివాచార్య‌ను ద‌ర్శించుకున్న డీకే

Leave A Reply

Your Email Id will not be published!