Prabhas Salaar Teaser : 6న సలార్ టీజర్ రిలీజ్
సినిమాపై భారీ అంచనాలు
Prabhas Salaar Teaser : ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ , శృతి హాసన్ కలిసి నటిస్తున్న సలార్ మూవీకి సంబంధించి మూవీ మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. సోమవారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు జూలై 6న సలార్ చిత్రానికి సంబంధించి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
గురువారం విడుదలయ్యే సలార్ చిత్రాన్ని హొంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ప్రశాంత్ నీల్ తీసే టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ యష్ తో కేజీఎఫ్ , కేజీఎఫ్ 2 సినిమాలు తీశాడు. భారతీయ సినీ రంగాన్ని ఒక్క ఊపు ఊపాయి. కోట్లు కొల్లగొట్టాయి. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న కీలక చిత్రం సలార్(Salaar).
ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్(Prabhas) తో పాటు పృథ్వీ రాజ్ , సుకుమారన్ , శృతీ హాసన్ , జగతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా తెల్లవారుజామున 5.12 గంటలకు విడుదల చేయడం విశేషం.
ఇదిలా ఉండగా హోంబలే ఫిల్మ్స్ కు సంబంధించి యూట్యూబ్ ఛానల్ లో సలార్ చిత్రానికి సంబంధించి టీజర్ ను ప్రత్యక్షంగా చూడవచ్చని మూవీ మేకర్స్ వెల్లడించారు. ప్రశాంత్ నీల్ తదుపరి మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ప్రియాంక చోప్రాతో సినిమా తీస్తున్నాడు.
Also Read : Revanth Reddy : బీఆర్ఎస్ ఖతం పవర్ లోకి వస్తాం