Rahul Gandhi Viral : రాహుల్ గాంధీ వైర‌ల్

ఢిల్లీలో మెకానిక్ ల‌తో రిపేర్

Rahul Gandhi Viral : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న దేశం త‌ర‌పున‌, ప్ర‌జ‌లంద‌రి త‌ర‌పున త‌న వాయిస్ ను వినిపిస్తున్నారు. కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ ను నిల‌దీస్తున్నారు. అంత‌కంటే ఎక్కువ‌గా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఒక‌నాడు కొన్ని శ‌క్తులు రాహుల్ గాంధీని ప‌ప్పు అని పిలిచారు. ఎద్దేవా చేశారు. ఆపై సోష‌ల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు.

ఈ త‌రుణంలో రాహుల్ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర దేశంలో సంచ‌ల‌నం క‌లిగించింది. ఆయ‌న చేప‌ట్టిన యాత్ర గురించి దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేప‌ట్టిన ఈ యాత్ర రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బిగ్ మైలేజ్ వ‌చ్చింది. ఆయ‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. ఈ త‌రుణంలో పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు క‌లుసుకున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆయ‌న‌తో ట‌చ్ లో ఉన్నారు.

రోజు రోజుకు పెరుగుతున్న పాపులారిటీ ఆయ‌న కొంప ముంచేలా చేసింది. చివ‌ర‌కు మోదీపై చేసిన కామెంట్స్ కు పార్ల‌మెంట్ లో రాహుల్ గాంధీ లోక్ స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయ్యింది. అయినా రాహుల్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. లారీ ఎక్కారు. డ్రైవ‌ర్ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఢిల్లీ లోని క‌రోల్ బాగ్ లో బైక్ మెకానిక్ ల‌తో ముచ్చ‌టించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

Also Read : Prabhas Salaar Teaser : 6న స‌లార్ టీజ‌ర్ రిలీజ్

 

Leave A Reply

Your Email Id will not be published!