Mallikarjun Kharge : నాయకత్వానికి శిక్షణ అవసరం – ఖర్గే
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ వెల్లడి
Mallikarjun Kharge : సమర్థవంతమైన నాయకత్వం అన్నది పార్టీకి అత్యంత అవసరమని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. బుధవారం లీడర్ షిప్ పై ప్రత్యేకంగా శిక్షణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. 1920 నుంచి 1940 మధ్య కాలంలో కాంగ్రెస్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే.
నాయకత్వం గురించి ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. ఆనాడు మహాత్మా గాంధీ స్పూర్తి దాయక నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు శిక్షణ పొందారని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే.
పరస్పర చర్చలతో అన్ని సమస్యలను పరిష్కరించుకున్నారని తెలిపారు . ప్రజాస్వామ్యంలో ప్రతి నిత్యం సవాళ్లు ఎదురవుతుంటాయని వాటిని గుర్తించి ముందుకు వెళ్లగలడమే మిగిలి ఉందన్నారు. ఇందుకు గాను పదవులు పొందిన వారు, ఆశిస్తున్న వారు నేర్చుకోవాల్సింది పార్టీని అర్థం చేసుకోవడమని పేర్కొన్నారు.
ఎందుకంటే విధి విధానాలు, పార్టీ ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలను గుర్తించాలని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). కార్యకర్తలు , నేతలు పార్టీకి పట్టు కొమ్మలన్నారు. వారంతా నిరంతరం నేర్చుకునేందుకు రెడీగా ఉండాలని స్పష్టం చేశారు. లేక పోతే వెనుకబడి పోతామని అన్నారు ఏఐసీసీ చీఫ్.
పార్టీ పరంగా దేశ వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు మల్లి కార్జున్ ఖర్గే. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నారు. దీని వల్ల పార్టీ మరింత బలోపేతం చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు .
Also Read : Balagam 100 Awards : బలగానికి 100 అవార్డులు