KTR Allegro MS : హైదరాబాద్ లో అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్
ఆనందంగా ఉందన్న మంత్రి కేటీఆర్
KTR Allegro MS : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే పేరు పొందిన మరో దిగ్గజ కంపెనీ హైదరాబాద్ ను ఎంచుకుందని తెలిపారు. అత్యాధునిక సెన్సార్ ,పవర్ సొల్యూషన్స్ కు పేరు పొందిన సెమీ కండక్టర్స్ లో గ్లోబల్ లీడర్ గా ఉన్న అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్ త్వరలోనే హైదరాబాద్ కంపెనీ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు కేటీఆర్. ఈ సందర్బంగా సదరు కంపెనీని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కస్టమర్ బేస్ , వార్షిక ఆదాయం కలిగి ఉందని స్పష్టం చేశారు మంత్రి. దాదాపు అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్ కంపెనీ ఆదాయం బిలియన్ డాలర్లను అధిగమించిందని ఇంతకంటే ఇంకేం కావాలని పేర్కొన్నారు కేటీఆర్(KTR). కంపెనీ త్వరలోనే హైదరాబాద్ లో సంస్థను ఏర్పాటు చేయనుందని తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంలో ఈ మొబిలిటీ (ఎలక్ట్రిక్ వెహికల్స్ , అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కి సంబంధించి ఉత్తేజ కరమైన డొమైన్లపై ఫోకస్ పెడుతుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్ కంపెనీ తెలంగాణ మొబిలిటీ వ్యాలీతో కలిసి పని చేస్తుందన్నారు.
Also Read : CM KCR Meeting : 24న సూర్యాపేటలో కేసేఆర్ సభ