BJP Election In Charges : భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే దేశంలోని ఐదు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షులను మార్చింది. ఇందులో భాగంగా ఏపీకి పురంధేశ్వరి దేవిని, తెలంగాణకు కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్ రెడ్డిని నియమించింది. ఇది ఒక రకంగా బిగ్ షాక్. ఇదిలా ఉండగా జూలై 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ లో సభ జరగనుంది. ఈ కీలక తరుణంలో ఉన్నట్టుండి నాలుగు రాష్ట్రాలకు ఇంఛార్జ్ లను నియమించడం విస్తు పోయేలా చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి ప్రకాశ్ జవదేవకర్ కు బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో ఆయనకు సహాయకుడిగా సునీల్ మన్సల్ ను నియమించింది. దీంతో ఈ ఏడాదిలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పవర్ లో ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసింది.
ఇక వీరితో పాటు రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆ రాష్ట్రానికి కూడా ఇంఛార్జ్ ను నియమించింది. ఆ రాష్ట్రానికి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది బీజేపీ(BJP) హై కమాండ్. చత్తీస్ గఢ్ కు ఓం మాథుర్ , భూపేంద్ర యాదవ్ ను మధ్య ప్రదేశ్ ఇంఛార్జ్ గా నియమించింది. ఈసారి తెలంగాణలో ఎలాగైనా కాషాయ జెండా ఎగుర వేయాలని పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా బండిని మార్చింది. ఈటల రాజేందర్ కు ఎలక్షన్ క్యాంపెయిన్ చైర్మన్ గా నియమించింది.
Also Read : Minister KTR : ఆ ఇద్దరికీ రూ కోటిన్నర సాయం
