Pankaja Munde : కాంగ్రెస్ లో చేరడం లేదు – పంకజా ముండే
సంచలన ప్రకటన చేసిన బీజేపీ నాయకురాలు
Pankaja Munde : మరాఠాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఎన్సీపీ నుంచి తిరుగుబాటు జెండా ఎగుర వేసిన అజిత్ పవార్ తన టీమ్ తో కలిసి షిండే, బీజేపీ సర్కార్ కు మద్దతు ఇచ్చాడు. ఈ తరుణంలో బీజేపీలో ఒక వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న తమకు పార్టీ ప్రయారిటీ ఇవ్వడం లేదని వాపోతోంది. ఈ తరుణంలో అధికారంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి చెందిన
జాతీయ కార్యదర్శి పంకజా ముండే సంచలన కామెంట్స్ చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోందని ఇది పూర్తిగా అబద్దమని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు పంకజా ముండే(Pankaja Munde). ఆమె చేసిన కామెంట్స్ బీజేపీలో కలకలం రేపాయి. ఎన్సీపీ చేరడాన్ని బీజేపీకి చెందిన వారు అంత త్వరగా జీర్ణించు కోరని పేర్కొన్నారు మరాఠా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. పంకజా ముండే చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ఆమె మొదటి నుంచీ పార్టీ కోసం పని చేస్తున్నారని చెప్పారు ఫడ్నవీస్.
ఇదిలా ఉండగా శుక్రవారం పంకజా ముండే మీడియాతో మాట్లాడారు. తాను రాహుల్ ,సోనియా గాంధీని కలిశానంటూ ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం వేస్తానంటూ హెచ్చరించారు.
Also Read : BJP Election In Charges : 4 రాష్ట్రాల్లో ఎన్నికల ఇంఛార్జ్ లు
