CM KCR : సాయి చంద్ కు కేసీఆర్ నివాళి
గాయకుడి మరణం బాధాకరం
CM KCR : ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ గాయకుడు సాయి చంద్ మరణం తీరని లోటు అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. ఆదివారం హైదరాబాద్ లోని హస్తినాపురంలో ఏర్పాటు చేసిన దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సింగర్ సాయి చంద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేసీఆర్. సాయి చంద్ తండ్రి వెంకట్ రాములు , భార్య రజని , కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం. కన్నీళ్లతో నిండిన వారందరిని ఓదార్చారు కేసీఆర్. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా గాయకుడు సాయి చంద్ చిన్న వయస్సు లోనే మరణించడం అందరినీ బాధకు గురి చేసింది. సాయించద్ స్వస్థలం నారాయణ పేట్ జిల్లా అమరచింత. చిన్నప్పటి నుంచే గాయకుడిగా ఉన్నారు. ఎన్నో పాటలకు ప్రాణం పోశాడు సాయి చంద్. అంచెలంచెలుగా సింగర్ గా రాణించాడు. తెలంగాణ పోరాట సమయంలో, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాయి చంద్ గాయకుడిగా గుర్తింపు పొందాడు.
అనంతరం సాయి చంద్ పార్టీకి తన వాయిస్ గా మారాడు. ఎక్కడ సీఎం సభ జరిగినా సాయి చంద్ పాట పాడాల్సిందే. ఆయన చేసిన సేవలను గుర్తించి సీఎం కేసీఆర్(KCR) రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమించారు. ఆయన అకాల మరణం చెందడంతో సాయి చంద్ భార్య రజనిని చైర్ పర్సన్ గా నియమించారు సీఎం.
అన్ని రకాలుగా భరోసా ఇచ్చారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సాయి చంద్ కు నివాళి అర్పించారు.
Also Read : Vikram Oberai : హొటల్స్ స్థాపించడం అదృష్టం