Arvind Kejriwal : ఢిల్లీలో రెండు రోజులు నీళ్లకు కొరత
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
Arvind Kejriwal : దేశ రాజధాని ఢిల్లీ వర్షాల తాకిడికి విల విల లాడుతోంది. ఆప్ ప్రభుత్వం సహాయక చర్యలలో నిమగ్నమైంది. ఎప్పటికప్పుడు సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్యవేక్షిస్తున్నారు. భారీగా నీరు చేరుకోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరో వైపు ఉత్తరాదిలో వర్షం ఉగ్ర రూపం దాల్చింది. వర్షాల దెబ్బకు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభించింది. వర్షాల కారణంగా పలు నదులు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. అవి ప్రమాద స్థాయిని దాటేశాయి. ఇక ఢిల్లీ మీదుగా వెళ్లే యమునా నది 40 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో పొంగి పొర్లి ప్రవహిస్తోంది.
గురువారం స్వయంగా ఢిల్లీ సీఎం వజీరాబాద్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి నగర వాసులకు నీరు సరఫరా అవుతోంది. ఇక యమునా నది ఉప్పొంగడంతో మూడు డబ్ల్యూటీపీలు మూసి వేసినట్లు చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మీడియాతో మట్లాడారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టామని , ఆప్ నేతలు, కార్యకర్తలు సేవలు అందిస్తున్నారని చెప్పారు. కాగా మరో సంచలన ప్రకటన చేశారు సీఎం. తాగు, వాడుకునేందుకు నిరంతరం వాడే నీళ్లు అందేందుకు కనీసం రెండు రోజుల సమయం పడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీ నగర వాసులు సహకరించాలని కోరారు.
తాజాగా సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రకటనతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఎక్కడ చూసినా నీళ్లే అగుపిస్తున్నాయి దేశ రాజధానిలో.
Also Read : AAP Support : భారీ వర్షం సహాయ చర్యల్లో ఆప్ నిమగ్నం