Daggubati Purandeswari : ఏపీకి కేంద్రం రూ.20 వేల కోట్లు
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణం
Daggubati Purandeswari : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. ఆమె రాష్ట్ర సర్కార్ ను తప్పు పట్టారు. కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం రూ. 20,000 కోట్లు ఇచ్చిందని అన్నారు. అయినా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారుల దుస్థితి గురించి ప్రజలను అడిగితే ఏమిటో చెబుతారని అన్నారు. పార్టీ చీఫ్ గా గురువారం దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రధానంగా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం వేల కోట్లు ఇచ్చిందని, ఇప్పటికే 65 శాతం ఇళ్లు పూర్తి కావాల్సి ఉండగా కేవలం 30 శాతం కూడా కాక పోవడం పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు పురంధేశ్వరి. ఉన్న పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి పోతున్నాయని, దీనిపై సీఎం జగన్ ఆలోచించు కోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు పురందేశ్వరి. ఆమె వెంట మాజీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
Also Read : CM Siddaramaiah : లా అండ్ ఆర్డర్ కు ఢోకా లేదు – సీఎం