Pawan Kalyan : అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ
ఏపీ రాష్ట్ర అంశాలపై చర్చ
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో టీడీపీకి ఆహ్వానం అందలేదు. దీంతో నారా చంద్రబాబు నాయుడు వెళ్లలేక పోయారు. ఇక జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు ఎన్డీయే కన్వీనర్ గా ఉన్న ప్రధాని మోదీ.
Pawan Kalyan Said
ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). భారతీయ జనతా పార్టీతో తమ పార్టీ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో టీడీపీ తమతో కలిసి వస్తుందో రాదోనన్న విషయం ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికే వదిలి వేస్తున్నానని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఎన్డీయే కీలక సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలు చర్చించారు. ఏపీకి రావాల్సిన నిధుల గురించి కూడా అడిగారు. ఏపీని ఆదుకోవాలని కోరారు పవన్ కళ్యాణ్. అమిత్ షాతో జరిగిన భేటీ చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.
Also Read : Asia Cup Schedule : 2023 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్ – బీసీసీఐ