PM Modi : సంక్షేమం బీజేపీ సర్కార్ లక్ష్యం
స్పష్టం చేసిన ప్రధాని మోదీ
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శనివారం కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం సంక్షేమం, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో పాలకులు దేశ అభివృద్ది గురించి పట్టించు కోలేదని, కేవలం వారి కుటుంబాల వారసులను రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
PM Modi & His works
తాను ప్రధానమంత్రిగా కొలువు తీరిన ఈ 9 ఏళ్ల కాలంలో పాలనా పరంగా అనేక రకాల మార్పులు తీసుకు రావడం జరిగిందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గణనీయంగా యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేశానని తెలిపారు. దేశంలో యువతీ యువకులు అత్యంత ప్రతిభావంతులని వారికి తగిన రీతిలో శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు మోదీ. ఇందు కోసం నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు ప్రధానమంత్రి.
యువ ప్రతిభావంతులకు గరిష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు . ఈ దిశగా ప్రతి ఏటా విరివిగా దేశ వ్యాప్తంగా ఉపాధి మేళాలు నిర్వహిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు నరేంద్ర మోదీ. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు పీఎం.
Also Read : Heavy Rains AP Telangana : భారీ వర్షం జర భద్రం