Palanivel Tyagarajan : తెలంగాణ ఐటీ సెక్టార్ సూపర్
మంత్రి పళనివేల్ త్యాగరాజన్
Palanivel Tyagarajan : తమిళనాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరంగా అద్భుతమైన ప్రగతిని సాధించిందని కొనియాడారు. ఇక్కడి అభివృద్దిని చూసి తాను విస్తు పోయానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు వచ్చాయని కితాబు ఇచ్చారు.
Palanivel Tyagarajan Said
ఇక్కడ తీసుకు వచ్చిన సంస్కరణలు, చోటు చేసుకున్న మార్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని స్పష్టం చేశారు పళనివేల్ త్యాగరాజన్(Palanivel Tygarajan). గత 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లనే ఈ అభివృద్ది సాధ్యమైందని పేర్కొన్నారు మంత్రి. భవిష్యత్తులో మరింత ముందుకు వెళుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
ఐటీ పరంగా ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ లో కొలువు తీరాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ , ఒరాకిల్ , అడోబ్ కంపెనీలు భాగ్యనగరాన్ని ఎంచుకున్నాయి. తమిళనాడు మంత్రి ప్రశంసలతో తెలంగాణ సర్కార్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంబంధిత ఐటీ , పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : APCC Protest : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఒప్పుకోం