KTR PM Modi : ప్ర‌ధాని ప్రోగ్రెస్ రిపోర్ట్ 0 – కేటీఆర్

సీఎంగా స‌క్సెస్ ప్ర‌ధానిగా ఫెయిల్

KTR PM Modi : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానిగా మోదీ 9 ఏళ్లు పూర్త‌యినా స‌క్సెస్ రేట్ నిల్ అంటూ ఎద్దేవా చేశారు. చెప్పుకునేందుకు ఏమీ లేద‌న్నారు. ఎంత సేపు కులం, మ‌తం, విద్వేషం త‌ప్ప ఆయ‌న సాధించింది ఏమీ లేద‌న్నారు. గుడ్ ఎక‌నామిక్స్ ఈజ్ గుడ్ పాలిటిక్స్ అని సీఎం కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతార‌ని తాను కూడా అదే పాటిస్తున్నాన‌ని చెప్పారు.

KTR PM Modi Discussion

అన్ని రంగాల‌లో తెలంగాణ అగ్ర భాగాన ఉంద‌న్నారు. దేశానికి అస‌లైన చిరునామా తెలంగాణ అని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డికి బ‌తికేందుకు వచ్చిన వాళ్ల‌ను వ‌ల‌స‌దారులు అని పిల‌వ‌డం మంచిది కాద‌న్నారు. ఎక్క‌డ అభివృద్ది జ‌రిగిందో అక్క‌డ స్థానికేత‌రులు ఎక్కువ‌గా ఉంటార‌ని చెప్పారు. అంబేద్క‌ర్ చెప్పిన బోధించు..స‌మీక‌రించు..పోరాడు అన్న నినాదంతో తెలంగాణ కోసం పోరాడ‌డం జ‌రిగింద‌న్నారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా సంప‌ద‌ను సృష్టించామ‌ని చెప్పారు కేటీఆర్(KTR). మౌలిక స‌మ‌స్య‌ల‌ను వ‌దిలేసి హిజాబ్ , హ‌లాల్ ,యూనిఫాం సివ‌ల్ కోడ్ త‌ల‌తిక్క అంశాల‌పై ప‌డ్డార‌ని కానీ తెలంగాణ ఇవేవీ ప‌ట్టించు కోలేద‌న్నారు. ప్ర‌భుత్వం ఏ ప‌థ‌క‌మైనా అమ‌లు చేయాలంటే గ‌ణాంకాలు అవ‌స‌ర‌మ‌న్నారు. విద్యుత్ ప‌రంగా 24 గంట‌ల పాటు ఇస్తున్నామ‌ని చెప్పారు.

దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు కేటీఆర్. నీళ్ల స‌మ‌స్య లేద‌న్నారు. తెలంగాణ అంటే స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ్మిళిత‌, స‌మ‌తుల్య అభివృద్దికి చిరునామా అని పేర్కొన్నారు. గుజ‌రాత్ మోడ‌ల్ అన్నారు. ఇప్పుడు మ‌ణిపూర్ మోడ‌ల్ తీసుకు వ‌స్తారా అని ప్ర‌శ్నించారు కేటీఆర్.

Also Read : HD Kumara Swamy : కాంగ్రెస్ తో కుస్తీ క‌మ‌లంతో దోస్తీ

Leave A Reply

Your Email Id will not be published!