Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తజనం సుమారు 74వేలమంది
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు
Tirumala Rush : తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గత 60 రోజుల నుంచి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్కరోజు 73 వేల 137 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి 27 వేల 490 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
Tirumala Rush News
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ లను దర్శించుకునేందుకు తిరుమల లోని ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక సర్వ దర్శనం టోకెన్లు లేకుండా స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న వారి సంఖ్య భారీగా ఉన్నారని 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు తరలి వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా సిబ్బంది అహర్నిశలు పని చేస్తున్నారని పేర్కొన్నారు. భారీ వర్షాలు ఉన్నప్పటికీ భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదని స్పష్టం చేశారు.
Also Read : Godavari Flow : భారీ వర్షం గోదావరి ఉగ్రరూపం