Raghav Chadha : మ‌ణిపూర్ స‌ర్కార్ ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి

ఆప్ ఎంపీ రాఘవ్ చ‌ద్దా డిమాండ్

Raghav Chadha : మ‌ణిపూర్ త‌గ‌ల‌బ‌డి పోతోంది. అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతోంది. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం కానీ ప‌ట్టించు కోవ‌డం లేదు. బాధ్య‌త వ‌హించాల్సిన సీఎం త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు ఉన్నారు. ఇక ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పార్ల‌మెంట్ కు రావ‌డం మానేశారు. కేవ‌లం జ‌వాబుదారీగా ఉండాల్సి వ‌స్తుంద‌నే నెపంతో అంటూ తీవ్ర స్థాయిలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా.

Raghav Chadha Words

గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొన్నారు. 26 పార్టీల‌కు చెందిన ఎంపీలంతా ఇవాళ ముక్త కంఠంతో ఒక్క‌టే అడుగుతున్నారు మ‌ణిపూర్ లో ఏం జ‌రుగుతోంద‌ని. కానీ జ‌వాబు చెప్పేందుకు మోదీ ద‌గ్గ‌ర‌, ఆయ‌న సంకీర్ణ స‌ర్కార్ వ‌ద్ద ఎలాంటి ఆధారాలు లేవ‌ని మండిప‌డ్డారు రాఘ‌వ్ చ‌ద్దా.

మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌పై జ‌రుగుతున్న దౌర్జ‌న్యాల‌కు నిర‌స‌న‌గా న‌ల్ల బ‌ట్ట‌లు ధ‌రించి పార్ల‌మెంట్ కు వెళ్లాల‌ని ఎంపీలంతా నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. ఆ మేర‌కు తామంతా హాజ‌ర‌వుతున్న‌ట్లు చెప్పారు. ఈ దుఖః సమ‌యంలో మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటామ‌నే సందేశాన్ని పంప‌డం చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha). దేశంలో అంత‌ర్భాగంగా రాష్ట్రం లేదా అని ప్ర‌శ్నించారు ఆప్ ఎంపీ. మ‌ణిపూర్ ప్ర‌భుత్వాన్ని, సీఎంను వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Also Read : YCP Support Centre : కేంద్రం బిల్లుల‌కు వైసీపీ ఎంపీల మ‌ద్ద‌తు

 

Leave A Reply

Your Email Id will not be published!