Bhagwant Mann : హెడ్మాస్టర్లకు ఐఐఎంలో శిక్షణ – సీఎం
శిక్షణా బృందానికి ఫ్లాగ్ ఊపిన మాన్
Bhagwant Mann : పంజాబ్ ప్రభుత్వం విద్యా రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించింది. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుల్లో మౌలిక వసతి సదుపాయాలు కల్పించే చర్యలు చేపట్టింది. దీనికంతటికి ప్రధాన కారకుడు సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann). ఆయన తండ్రి టీచర్. తను కూడా టీచర్ కావాలన్నది తండ్రి కల.
Bhagwant Mann Development
కానీ మాన్ అలా కాలేక పోయారు. నటుడయ్యాడు. చివరకు లీడర్ గా గుర్తింపు పొందారు. స్టేజ్ ఆర్టిస్ట్ గా పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆపై ఎంపీగా, ఎమ్మెల్యే గా గెలుపొందారు. చివరకు ఎవరూ ఊహించని రీతిలో పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొలువుతీరారు భగవంత్ మాన్.
ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు విద్యా పరంగా. ఇప్పటికే పలువురు టీచర్లకు శిక్షణ ఇప్పించేందుకు సింగపూర్ కు పంపించారు. తాజాగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఆయా పాఠశాలలకు చెందిన హెడ్మాస్టర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. ఆదివారం తన కార్యాలయం నుంచి టీంకు జెండా ఊపి పంపించారు. ఈ హెడ్మాస్టర్లందరికీ అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్లకు అభినందనలు తెలిపారు.
Also Read : Kangana Ranaut : కరణ్ జోహార్ పై కంగనా కన్నెర్ర