MLA Seethakka : బాధితులకు సీతక్క భరోసా
ఆదుకోవాల్సిన బాధ్యత సర్కార్ దే
MLA Seethakka : రాష్ట్రంలో వరద బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే ధనసరి సీతక్క. ఓ వైపు భారీ వర్షాల తాకిడికి ములుగు, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, తదితర జిల్లాలన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. మరో వైపు కృష్ణా, గోదావరి నదులు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయి దాటాయి.
MLA Seethakka Helping
ఈ తరుణంలో తానే రంగంలోకి దిగారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. పునరావాస కేంద్రాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఇండ్లు కోల్పోయిన వారికి, వస్తువులు కోల్పోయిన వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే సీతక్క.
తాను ప్రభుత్వంతో కొట్లాడుతానని ఈ సందర్భంగా చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ కింద రూ. 900 కోట్ల నిధులు ఉన్నా ఎందుకని కేసీఆర్ సర్కార్ వాడుకోవడం లేదంటూ ప్రశ్నించారు ధనసరి సీతక్క(Danasari Seethakka). ఓ వైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ఇప్పటి వరకు చర్యలు చేపట్ట లేదన్నారు.
వరదలు సృష్టించిన బీభత్సానికి పలువురు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గల్లంతయ్యారని , బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆమె కోరారు. తమ నియోజకవర్గ పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దాసరి సీతక్క.
Also Read : G Kishan Reddy : బాపురావు కామెంట్స్ వ్యక్తిగతం