AP CM YS Jagan : పౌష్టికాహారం కోసం రూ. 2,300 కోట్లు
స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
AP CM YS Jagan : ఫౌండేషన్ స్కూల్స్ లలో చదువుకుంటున్న చిన్నారుల బోధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. బుధవారం మహిళా , శిశు సంక్షేమం శాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం.
ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై పరిశీలన చేయాలని ఆదేశించారు. ఇంగ్లీషులో భాషా పరిజ్ఞానం, స్పష్టంగా ఉచ్ఛారణ బాగుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ , టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రారంభించారు.
AP CM YS Jagan Explains
గతంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ. 450 నుంచి రూ. 500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కానీ తాము పవర్ లోకి వచ్చాక దానిని భారీగా పెంచామన్నారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). కేవలం పౌష్టికాహారం కోసం ప్రతి ఏటా చేస్తున్న ఖర్చు రూ. 2,300 కోట్లు అని స్పష్టం చేశారు సీఎం.
సంపూర్ణ పోషణ కింద నెలకు 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల చిక్కీ, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కేజీల బియ్యం, అర లీటరు వంట నూనె, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు అందజేస్తోంది సర్కార్.
వైఎస్సార్ పోణ ప్లస్ కింద 1 కేజీ రాగి పండి, 2 కేజీల మల్టీ గ్రెయిన్ అట్టా, 500 గ్రాముల బెల్లం, 500 గ్రాముల చిక్కీ, 500 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, అర లీటరు వంట నూనె, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు ఇస్తున్నది ఏపీ ప్రభుత్వం.
Also Read : MP Sanjay Singh : మోదీ పాలనలో రాజ్యాంగానికి పాతర