Amit Shah Focus : తెలంగాణ బీజేపీపై షా ఫోకస్
నేతలంతా నియోజకవర్గాల్లోనే
Amit Shah Focus : తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు రాబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు ఉన్నాయి. వామపక్షాలు ఉన్నా లేనట్టే. దీంతో ఈసారి ఎలాగైనా సరే ప్రతిపక్షంగా, ప్రత్యామ్నాయంగా ఉండాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు కీలక మార్పులు చేసింది.
Amit Shah Focus Telangana
ఇక నుంచి ఢిల్లీ నుండి వేదికగా తెలంగాణలో రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా నేతలు గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) దక్షిణాదిలో పాగా వేయాలని ప్రత్యేకించి తెలంగాణపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలంతా హైదరాబాద్ లో ఉండ కూడదని, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించాలని, ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కనీసం 75 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా కిషన్ రెడ్డి నివాసంలో హై లెవల్ సమావేశం జరిగినట్లు టాక్. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.
Also Read : AP CM YS Jagan : పౌష్టికాహారం కోసం రూ. 2,300 కోట్లు