Gaddar Comment : దివికేగిన ప్రజా గానం

25 ఏళ్లు అయ్యింది తూటాలు దిగి

Gaddar Comment : ప్ర‌జ‌ల పాట ఆగి పోయింది. మాట నిలిచి పోయింది. కోట్లాది మందిని త‌న అద్భుత‌మైన గొంతుతో ఆడి పాడిన ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ గొంతు మూగ బోయింది. ఇవాళ ఇక తాను పాడ‌లేనంటూ దివికి ఏగాడు గ‌ద్ద‌ర్. ఆగ‌స్టు 6న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయ‌న స్వ‌స్థ‌లం మెద‌క్ జిల్లా తూఫ్రాన్ . 1949లో పుట్టారు. ఎన్నో ఉద్య‌మాల‌తో మ‌మేకం అయ్యాడు గ‌ద్ద‌ర్(Gaddar). జ‌నంలోకి వెళ్లాడు. ఆయ‌న పాడ‌ని పాట అంటూ లేదు. శ్ర‌మ జీవులు, కార్మికులు, అన్న‌ల గురించి పాడాడు. గొంగ‌డి , గోచి క‌ట్టుకుని ఆడి పాడాడు. బెల్లి ల‌లిత‌తో తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోశాడు. ఆయ‌న పూర్తి పేరు గుమ్మ‌డి విఠ‌ల్ రావు. విప్ల‌వ క‌విగా గుర్తింపు పొందాడు. ఆనాడు బ్రిటీష్ రాజ్యాన్ని వ్య‌తిరేకించిన గ‌ద‌ర్ పార్టీ కి గుర్తుగా గ‌ద్ద‌ర్ నిలిచి పోయాడు. జీవిత‌మంతా క‌ష్టాలు ప‌డ్డాడు గ‌ద్ద‌ర్. చివ‌రి వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం ప‌ల‌వ‌రించాడు. పాడ‌కుండా ఉండ‌లేన‌ని పేర్కొన్నాడు.

Revolutionary writer Gaddar Comment

ప్ర‌జ‌లు స్వ‌చ్చంధంగా త‌ర‌లి వ‌చ్చారు తండోప‌తండాలుగా. ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌ద్ద‌ర్ ప్రాముఖ్య‌త చెందిన వాడు. ప్ర‌జ‌ల‌కు సంబంధించి యుద్దం చేశాడు. తెలంగాణ ప్రాంతానికి తీర‌ని లోటు గా చెప్ప‌క త‌ప్ప‌దు. గుండె లేని వాళ్ల‌కు, అణ‌గారిన వ‌ర్గాల‌కు, పేద‌ల‌కు గొంతుక‌గా ఉన్నాడు . వేలాది ఊర్ల‌ను తిరిగాడు. వేలాది మంది గాయ‌కుల‌ను ప్ర‌భావితం చేశాడు. వంద‌లాది పాట‌లు రాశాడు. తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోశాడు. ఇటు తెలంగాణ‌లో అటు ఏపీలో కూడా ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేశాడు గ‌ద్ద‌ర్. ప్ర‌జా సంస్కృతికి ప్ర‌తీక‌గా నిలిచాడు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దుఖఃంతో నిండి పోయింది. తెలిసిన క‌ళాకారులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. పాట‌లు రాశాడు , ఆడాడు. ఏపీలో వంగ‌పండు ప్ర‌సాద‌రావు తో పాటు ఏపీలో కూడా పాడాడు. వారి గొంతును తానై వినిపించాడు. సాయుధ పోరాటంలో కాకుండా ప్ర‌జా యుద్దంలో ఉండాల‌ని త‌ల‌పించాడు. చివ‌ర‌కు తాను మారాడు.

తెలంగాణ సంస్కృతిని అత్యంత గొప్ప‌గా ఆలాపించిన అరుదైన గాయ‌కుడు గ‌ద్ద‌ర్. 1971లో బి. న‌ర‌సింగ‌రావు తొలి పాట ఆప‌ర రిక్షా రాశాడు. ఆయ‌న తొలి ఆల్బం పేరు గ‌ద్ద‌ర్. బుర్ర క‌థ‌ల‌ను పాడాడు. శ‌త్రువును ముద్దాడిన వాడు. ద‌ళిత కుటుంబం నుంచి వ‌చ్చిన గుమ్మ‌డి విఠ‌ల్ రావు లేక పోవ‌డం బాధాక‌రం. ఎన్నో బాధ‌లు అనుభ‌వించిన అరుదైన ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్. ఆయ‌న మొద‌టి నుండి తెలంగాణ వాదిగా ఉన్నారు. చివ‌రి దాకా కూడా. మావోయిస్టు పార్టీ తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకున్న‌పుడు సైతం తెలంగాణ వైపు నిలిచిన యోధుడు . ప్ర‌జా ఫ్రంట్ పేరుతో ముందుకు వెళ్లారు. ఆనాటి ఉద్య‌మ కాలంలో ఆయ‌న రాసి, పాడిన అమ్మా తెలంగాణమా అనే పాట ప్ర‌జాద‌ర‌ణ పొందింది. నీ పాదం మీద పుట్టు మ‌చ్చ నై చెల్లెమ్మా అని పాడాడు. జ‌న నాట్య మండ‌లి, ప్ర‌జా నాట్య మండ‌లి ఇలా ప్ర‌తి సంద‌ర్భంలోనూ ,పాటై ప్ర‌వ‌హించాడు గ‌ద్ద‌ర్. ప్ర‌జా యుద్ద నౌక లేని లోటు తెలంగాణకే కాదు యావ‌త్ దేశానికే తీర‌ని న‌ష్టం.

Also Read : Gaddar Passes Away : ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ ఇక లేడు

Leave A Reply

Your Email Id will not be published!