Gaddar Lal Salam : గద్దరన్నకు లాల్ సలాం
ప్రజా కవులు సుద్దాల, గోరేటి
Gaddar Lal Salam : ప్రజా యుద్ద నౌక గద్దర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని తరాలను తన ఆట పాటలతో ప్రభావితం చేసిన అరుదైన గాయకుడు గద్దరన్న. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం విషాదంలో కొనసాగుతోంది. ఇది అణగారిన , పేదల , దోపిడీకి గురైన వారందరికీ ఆసరాగా నిలిచిన గొంతు ఇవాళ లేక పోవడం తీరని నష్టమని కన్నీటి పర్యంతం అయ్యారు కవి, గాయకులు సుద్దాల అశోక్ తేజ(Suddala Ashok Teja), గోరేటి వెంకన్న.
Gaddar Lal Salam People Says
1949లో తూఫ్రాన్ లో పుట్టిన గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు అంచెలంచెలుగా ప్రపంచం గుర్తించే స్థాయికి చేరుకున్నారు. ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డారు. చివరి శ్వాస ఉన్నంత వరకు పాటను ప్రేమిస్తూనే..దానిని శ్వాసగా కంటిన్యూ చేస్తూ వచ్చారు.
ఒకటా రెండా వేల పాటలు పాడారు. దేశమంతటా పక్షిలా తిరిగారు. నక్సల్ ఉద్యమానికి తన పాటతో ఊపిరి పోసిన గద్దర్ దేశంలోని ప్రజా పోరాటాలకు శక్తినిచ్చాడు. ఆట, పాటలతో కోట్లాది మందిని ప్రభావితం చూస్తూ వచ్చారు. తూటాలను శరీరంలో ఉంచుకుని జనం కోసం గానమై ప్రవహించిన గద్దర్ లాంటి కవి, గాయకుడు ప్రపంచంలో లేరు. గద్దర్ వ్యక్తి కాదు ఓ మహా శక్తిగా మారారు.
తన జీవిత కాలమంతా ప్రజల కోసం ఆక్రోశించాడు. వారి కోసమే పాడాడు. గద్దర్ పాడిన పాటలు నేటికీ ప్రజల నాలుకల మీద నర్తిస్తున్నాయి. మీ పాటనై వస్తున్నాననంటూ వెళ్లి పోయాడు ప్రజా యుద్ద నౌక.
Also Read : Owaisi Gaddar : గద్దర్ పేదల గొంతుక – ఓవైసీ బ్రదర్స్