Gruhalakshmi Scheme : గృహలక్ష్మి దరఖాస్తుల స్వీకరణ
మూడు రోజుల్లోపే డెడ్ లైన్ ప్రకటన
Gruhalakshmi Scheme : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హామీలు కురిపిస్తోంది. పథకాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని , మూడోసారి సీఎం కావాలని , హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ మేరకు స్థలాలు ఉన్న వారికి తీపి కబురు చెప్పారు.
Gruhalakshmi Scheme Starts in Telangana
తెలంగాణ రాష్ట్రంలో సొంత జాగా ఉన్న వారికి సొంతింటి కల నెరవేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇల్లు కట్టుకునే వారికి స్థలం గనుక ఉన్నట్లయితే రూ. 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర సర్కార్ విధి విధానాలను, మార్గదర్శకాలను జారీ చేసింది.
తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇవాల్టి నుంచి రాబోయే మూడు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా స్థలాలు ఉన్న మహిళలకు ప్రత్యేకించి గృహ లక్ష్మి పథకం(Gruhalakshmi Scheme) కింద దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించారు సీఎం.
ఆసక్తి, అర్హత కలిగి ఉన్న మహిళలు వెంటనే గృహ లక్ష్మి కింద దరఖాస్తు చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున కలెక్టర్ చేతుల మీదుగా లబ్ది దారులను ఎంపిక చేస్తారని ప్రకటించారు. తహశీల్దార్, మున్సిపల్ ఆఫీసుల్లో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read : Zaheer Ali Khan : కలం యోధుడు జహీర్ కు నివాళి