V Srinivas Goud Neera Cafe : నీరాతో ఆరోగ్యం పదిలం
విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్
V Srinivas Goud Neera Cafe : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర సర్కార్ నీరాకు ప్రయారిటీ ఇస్తోంది. ప్రధానంగా ఇది ఆల్కహాల్ కానే కాదని చెబుతోంది. ఇది అన్ని వయసుల వారు తాగవచ్చని సూచించింది. ఇప్పటికే దీనిని శాస్త్రీయంగా పరిశోధన చేపట్టేలా చేసింది. ఆ తర్వాత అన్ని పరిశోధనలు ముగిశాక నీరాను అమ్మకానికి పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నీరాకు హెవీ డిమాండ్ ఉంటోంది.
V Srinivas Goud Neera Cafe Visited
పక్కన ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు సైతం ఈ నీరా కథేంటి, దాని వెనుక ఆరోగ్యపు మతలబు ఏంటి అనేది ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud) దీని గురించి పూర్తిగా వివరించారు.
ఇక ట్యాంక్ బండ్ సమీపంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నీరా కేఫ్ ను ఏర్పాటు చేశారు. దీనిని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున నీరాను జనం ఆస్వాదిస్తున్నారు. అందులోని మజాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ పెద్ద ఎత్తున నీరా తయారీ కోసం ఖర్చు చేసింది. భారీ ఎత్తున యంత్రాలను తీసుకు వచ్చి ఏర్పాటు చేసింది.
తాజాగా నీరా కేఫ్ ను మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్ తో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , మేయర్ గుండు సుధా రాణి సందర్శించారు. నీరాను వారు స్వయంగా తాగారు. బాగుందని కితాబు ఇచ్చారు. నీరా వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొన్నారు.
Also Read : Gruhalakshmi Scheme : గృహలక్ష్మి దరఖాస్తుల స్వీకరణ