YS Sharmila : చర్చలు సఫలం షర్మిల మౌనం
ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
YS Sharmila : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) నిన్న హుటా హుటిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమెతో గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతోంది. ఎలాగైనా సరే ఈసారి తెలంగాణలో పార్టీ పాగా వేయాలని చూస్తోంది. ఈ మేరకు అన్ని అస్త్రాలను సిద్దం చేసింది. అందివచ్చిన అవకాశాలను గుర్తించడం, భావ సారూప్యత కలిగిన పార్టీలను , వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది.
YS Sharmila Delhi Tour Viral
అందులో భాగంగానే గతంలో కాంగ్రెస్ లోనే ఉంటూ వైఎస్సార్ దుర్మరణం తర్వాత కొంత దూరంగా వచ్చింది ఆయన కుటుంబం. దీంతో సోదరుడు వైఎస్ జగన్ జైలు పాలు కావడం, ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టడం ఏపీలో ఏకంగా అధికారంలో కొలువు తీరడం చకా చకా జరిగి పోయాయి.
ఈ తరుణంలో ఏపీలో కాకుండా తల్లి , కూతురు షర్మిల ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సమస్యలపై నిలదీస్తూ వచ్చారు. ఒక రకంగా అధికార పార్టీలో పక్కలో బల్లెంలా మారారు. షర్మిల కూడా పాదయాత్ర చేపట్టారు. భారీ ఎత్తున జనం ఆమెను ఆదరించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆమె కొంత మెతక వైఖరి ప్రదర్శిస్తూ వచ్చారు. తాజాగా ఢిల్లీలో హైకమాండ్ తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షర్మిల కలిసే వచ్చారు. కాగా ఏం జరిగిందనే దానిపై షర్మిల ఒక్క మాట మాట్లాడక పోవడం విశేషం.
Also Read : Minister KTR : ఉపాధి కల్పనలో తెలంగాణ టాప్ – కేటీఆర్