KC Venu Gopal Offer : షర్మిలకు కేసీ బంపర్ ఆఫర్
సికింద్రాబాద్ నుంచి పోటీకి ఛాన్స్
KC Venu Gopal Offer : తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ చీఫ్ , సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. లిస్టు కూడా రెడీ అయ్యిందని సమాచారం. ఈ తరుణంలో కాంగ్రెస్(Congress) పార్టీ పవర్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పావులు కదిపింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తాజాగా హైదరాబాద్ కు వచ్చి వెళ్లారు. పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. అభ్యర్థుల గెలుపు అవకాశాల గురించి కూడా తేల్చి చెప్పినట్లు కూడా తెలిసింది.
KC Venu Gopal Offer to Sharmila
రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తు విషయంపై కూడా ఆరా తీశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఆఫర్ ఇచ్చింది పార్టీ. ఈ మేరకు పార్టీని తమ పార్టీలో విలీనం చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిల తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. వచ్చే టప్పుడు ఎంపీ కోమటిరెడ్డితో కలిసి వచ్చారు.
పార్టీ పెద్దలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఖరారులో కీలక పాత్ర పోషిస్తున్న కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. పార్టీ విలీన ప్రక్రియ, పోటీ విషయంపై క్లారిటీ ఇవ్వాలని ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : BRS Candidates List : గులాబీ అభ్యర్థుల లిస్ట్ రెడీ..?