Assam CM : నాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు – సీఎం
హిమంత బిస్వా శర్మ కామెంట్స్
Assam CM : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లింలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వారి ఓట్లు అవసరం లేదన్నారు. హిందువుల ఓట్లు ఉంటే చాలని పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఆయన పచ్చి కాషాయ వాదిగా మాట్లాడుతున్నారు. ఆయన చేస్తున్న కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Assam CM Comments on Muslim Votes
భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ కులం పేరుతో, మతం పేరుతో ఇలా విభజిస్తూ, విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టేలా ఇతరుల గురించి మాట్లాడటం మంచి పద్దతి కాదని విపక్షాలు పేర్కొంటున్నాయి. తనకు హిందువుల ఓట్లు ఉంటే చాలని, ఇక ముస్లింల ఓట్లతో అవసరమే లేదని హిమంత బిస్వా శర్మ(Assam CM) చెప్పడం కలకలం రేపింది. ఇది ఇతర మతాల వారిని కించ పరిచేలా, భయాందోళనకు గురి చేసేలా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
మొత్తంగా ఒక బాధ్యత కలిగిన సీఎం ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబో ఆ పార్టీకి ఆయనకే తెలియాలి. ఇప్పటికే మణిపూర్ మండుతోంది. ఇక్కడ జాతుల పేరుతో జరుగుతున్న హింస, అల్లర్లను కంట్రోల్ చేయలేక పోతోంది అక్కడి బీజేపీ సర్కార్.
Also Read : Chandrababu Naidu : టీటీడీపై భగ్గుమన్న టీడీపీ చీఫ్