Pawan Kalyan : త్రివర్ణ పతాకమా వర్ధిల్లుమా
జెండా ఎగుర వేసిన పవన్ , మనోహర్
Pawan Kalyan : భారత జాతీయ పతాకానికి అభివందనం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. మంగళవరం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీలోని మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జెండాను తయారు చేసిన పింగళి వెంకయ్య చౌదరిని గుర్తు చేసుకున్నారు. జైహింద్ జై జవాన్ అంటూ నినదించారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Raised the Flag
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడారు. జాతీయ జెండా అనేది ఒక పతాకం కాదని అది కోట్లాది మంది గుండె చప్పుడు అన్నారు. వేలాది మంది త్యాగాల, బలిదానాల సాక్షిగా ఆగస్టు 15న దేశానికి విముక్తి లభించిందన్నారు. ఇవాళ మనందరం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామని అనుకుంటే దానికి కారణం వారు చేసిన విరోచిత పోరాటాలు, త్యాగలేనని పేర్కొన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
ఆనాటి స్వాతంత్ర స్పూర్తి నేటికీ కొనసాగుతూనే ఉందన్నారు. మహాత్మా గాంధీ , సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ , రాజ్ గురు , సుఖ్ దేవ్ ఇలా ఎందరో స్వాతంత్ర పోరాటంలో కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆనాడు జరిగిన అన్ని ఉద్యమాలలో, ఆందోళనలో మన రాష్ట్రానికి చెందిన వారు కూడా పాల్గొనడం జరిగిందన్నారు. నేటికీ వారు చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు పవన్ కళ్యాణ్.
Also Read : CM KCR : మానుకోటకు కేసీఆర్ నజరానా