Pawan Kalyan : ఏపీలో మహిళలకు భద్రత ఏది
సీఎంను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. మంగళవారం మూడో విడత వారాహి విజయ యాత్ర సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సగటు మహిళకు స్వాంతన చేకూర్చలేని అధికారం ఉండీ ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు.
Pawan Kalyan Slams YS Jagan
రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను సీఎం పాటించడం లేదంటూ ఆరోపించారు. మహిళలకు రాజ్యాధికారంలో మూడో వంతు భాగం ఇవ్వాలని డిమండ్ చేశారు. మహిళలు అదృశ్యంపై ఇప్పటి వరకు జగన్ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). జగన్ పాలన చూసి భయపడి పారి పోవద్దన్నారు. పోరాడాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ చీఫ్.
తాము గనుక అధికారంలోకి వస్తే ప్రజా ధనాన్ని అత్యంత పారదర్శకంగా ఖర్చు చేస్తామన్నారు. కొత్త పథకాలకు జాతి నాయకుల పేర్లు పెడతామన్నారు. అక్రమాలపై సమాచారం ఇచ్చే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకం ఇస్తామన్నారు. వైసీపీ నాయకుల అన్యాయాలపై జనసేన ప్రజాకోర్టు నిర్వహిస్తామన్నారు. వీర మహిళల సమావేశంలో జనసేన చీఫ్ ఈ కామెంట్స్ చేశారు.
Also Read : Minister KTR : తెలంగాణ బస్సుల్లో భరోసా – కేటీఆర్