TTD Hand Sticks : శ్రీవారి భక్తులకు చేతికర్రలు సిద్దం
నిమగ్నమైన తిరుమల తిరుపతి దేవస్థానం
TTD Hand Sticks : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సెక్యూరిటీ కోసం చర్యలు చేపట్టింది. ఇప్పటికే చిన్నారితో పాటు పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా కాలి నడకన వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత చిక్కినా ఇంకా మూడు చిరుతలు తిరుమల అడవులలో సంచరిస్తున్నాయని సాక్షాత్తు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ఇదే సమయంలో టీటీడీ పాలక మండలి కీలక సమావేశం జరిగింది.
TTD Hand Sticks Ready
ఇటీవలే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ(TTD Hand Sticks) చైర్మన్ గా కొలువు తీరారు. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే చిన్నారిని చిరుత చంపేసిన ఘటన చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా భక్తుల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండ పైకి నడిచి వచ్చేందుకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి అలిపిరి నడక దారి రెండోది శ్రీవారి మెట్ల దారి. ఈ రెండింటి వద్ద నడిచి వెళ్లే భక్తులకు సంబంధించి ప్రస్తుతానికి 100 మందితో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది టీటీడీ.
అంతే కాకుండా భక్తులకు ఆసరాగా ఉండేందుకు , క్రూర జంతువుల నుండి రక్షించు కునేందుకు గాను చేతి కర్రలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ మేరకు ఇవాళ ఊత కర్రలను తెప్పించి చూశారు. వాటిని ఎప్పటి నుంచి భక్తులకు అందజేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read : Mandakrishna Madiga : రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర బెటర్