Minister KTR : వారం రోజుల్లో తొలి విడత ఇండ్లు పంపిణీ
సమీక్ష చేపట్టిన ఐటీ మంత్రి కేటీఆర్
Minister KTR : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, పంపిణీపై ఫోకస్ పెట్టారు మంత్రి కేటీఆర్. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రగతి భవన్ లో బుధవారం మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకున్నారు. వారం రోజుల్లో తొలి విడత ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు.
Minister KTR Focus on Double Bedroom Houses Work
ఇప్పటి వరకు 70 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని , పంపిణీకి సిద్దంగా ఉన్నాయని , అర్హులైన లబ్దిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తోందని ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు.
నగర పాలక సంస్థ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తియందని మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. 4,500కు పైగా ఇండ్లను లబ్దిదారులకు ఇచ్చామన్నారు.
నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్దంగా ఉన్న 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందజేస్తామన్నారు. వచ్చే వారం లోపే ఈ ఇళ్లను పంపిణీ చేపడతామన్నారు కేటీఆర్. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని ఆదేశించారు.
Also Read : Tamili Sai Soundarrajan : స్టాలిన్ కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే