WHO Chief : ఆయుష్మాన్ ఆరోగ్య పథకం భేష్
డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంస
WHO Chief : మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆయుష్మాన్ ఆరోగ్య పథకం అద్భుతమని ప్రశంసించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్. గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరుగుతున్న జి20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. యూనివర్శిల్ హెల్త్ కవరేజీని డెవలప్ చేయడంలో భారత్ తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ కితాబు ఇచ్చారు.
WHO Chief Appreciates Modi Ruling
జి20 సమ్మిట్ ను నిర్వహించడంలో భారతదేశం ఆతిథ్యం, దూరదృష్టి కలిగిన నాయకత్వాన్ని అభినందించారు. హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను సందర్శించానని, అది కూడా ఆదర్శ ప్రాయంగా తీర్చి దిద్దారంటూ కొనియాడారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్(WHO Chief). 1,000 గృహాలకు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు బాగున్నాయని పేర్కొన్నారు డాక్టర్ టెడ్రోస్.
ఇదిలా ఉండగా గుజరాత్ లో అందించిన టెలి మెడిసిన్ సౌకర్యాలను ప్రశంసించారు. గ్లోబల్ డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్ కోసం జి20 ప్రెసిడెన్సీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సిస్టంను తీసుకు వచ్చినందుకు భారత దేశ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ సదస్సుకు వివిధ దేశాల నుండి 70 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.
Also Read : Minister KTR : ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తాం