Azharuddin Rajiv Gandhi : అరుదైన నేత రాజీవ్ గాంధీ
కొనియాడిన అజహరుద్దీన్
Azharuddin Rajiv Gandhi : భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్, మాజీ ఎంపీ, ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజహరుద్దీన్(Azharuddin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 20 దివంగత భారత దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 79వ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహ్మమద్ అజహరుద్దీన్ పంచుకున్న ఫోటో వైరల్ గా మారింది. నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Azharuddin Rajiv Gandhi Memories
అజహరుద్దీన్ అద్భుతమైన క్రికెటర్. ప్రపంచ క్రికెట్ లో వస్తూనే మూడు సెంచరీలు వరుసగా చేసి రికార్డు క్రియేట్ చేశాడు. భారత క్రికెట్ లో కీలకమైన ఆటగాడిగా, నాయకుడిగా ఉన్నారు. అద్భుతమైన, చిరస్మరణీయమైన విజయాలను అందించాడు ఈ దేశానికి. అనుకోని పరిస్థితుల్లో మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కుని ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కేసు కొట్టి వేసింది. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా తన భవిష్యత్తు నిర్ణయించుకునే పనిలో ఉన్నాడు. ఇదే సమయంలో తనను ఆదరించిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు అజహరుద్దీన్.
ఇదిలా ఉండగా జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆనాడు భారత జట్టు కెప్టెన్ గా ఉన్న అజహరుద్దీన్ ను ప్రత్యేకంగా అభినందించారు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ. ఐటీ, టెలికాం విప్లవానికి ఆద్యుడైన రాజీవ్ స్పూర్తి ఎల్లప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు అజ్జూ భాయ్.
Also Read : PM Modi Viral : నెట్టింట్లో ప్రధాని మోదీ వైరల్