Revanth Reddy : రాజీవ్ వల్లనే టెక్నాలజీ డెవలప్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్
Revanth Reddy : దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముందు చూపు వల్లనే ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయ్యిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇవాళ మనం వాడుతున్న వాట్సాప్ , ట్విట్టర్ అయన తీసుకువచ్చినవేనని పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్ లో ఐటీ ఇంత అభివృద్ది చెందిందని చెప్పారు. దానికి కారణం రాజీవ్ గాంధీయేనని స్పష్టం చేశారు. ఇవాళ మనం వినియోగిస్తున్న సెల్ ఫోన్లు రావడానికి కారణం మాజీ ప్రధాని అని పేర్కొన్నారు.
Revanth Reddy Tribute to Rajiv Gandhi
భారత దేశంలో కీలకమైన నాయకుడిగా ఎదిగారని తెలిపారు. గర్వించ దగిన నేతలలో రాజీవ్ గాంధీ ఒకరని ప్రశంసించారు. టెలికాం, టెక్నాలజీ ఈ రెండింటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారని స్పష్టం చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి పేర్కొన్నట్లు మన కాలంలో రాజీవ్ గాంధీ లాంటి నేత ఒకరు గుర్తు పెట్టుకునేలా ఉండడం గర్వించ దగిన విషయమన్నారు రేవంత్ రెడ్డి.
రాజీవ్ సద్భావనా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్ హనుమంత్ రావు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జీవితం స్పూర్తి దాయకమని పేర్కొన్నారు. ఆయనను ఈ దేశ యువతీ యువకులు స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చదువు ప్రాధాన్యతను గుర్తించారని, దానికి తోడు ఏదో ఒక రోజు టెక్నాలజీ అభివృద్ది చెందుతుందని ఆశించారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : YS Sharmila : ఖాకీల తీరుపై షర్మిల కన్నెర్ర