Chandrayan-3 : జాబిల్లి చెంతకు చంద్రయాన్ -3
భారత దేశంలో మిన్నంటిన సంబురాలు
Chandrayan-3 : అంతరిక్షంలోని చంద్రుని వద్దకు మన చంద్రయాన్ సగర్వంగా చేరుకుంది. భారతీయ జెండా పతాకం మరోసారి సగర్వంగా ఎగిరింది. చంద్రయాన్ -3 చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ ల్యాండ్ అయ్యింది. ఇస్రో సాధించిన ఘన విజయం ఇది. మన శాస్త్రవేత్తల కృషికి దక్కిన అరుదైన గౌరవం ఇది.
Chandrayan-3 in Moon
సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండ్ కావడంతో ఒక్కసారిగా దేశమంతటా సంబురాలు మిన్నంటాయి. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు.
అగ్ర దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరుకుందన్నారు. ఈ విజయం 140 కోట్ల భారతీయుల విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా పేరు పేరునా శాస్త్రవేత్తలను అభినందిస్తున్నట్లు తెలిపారు నరేంద్ర మోదీ.
ఈ ఘనత సాధించిన తొలి దేశంగా ఇండియా నిలిచింది. శ్రీహరి కోట లోని అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా చంద్రుడిపైకి ల్యాండ్ అయ్యే దానిని చూసి తరించారు. ఈ తరుణంలో చంద్రయాన్ -3(Chandrayan-3) ల్యాండ్ కావడంతో ఇతర దేశాలు ఆశ్చర్య పోయాయి.
ఇప్పటి దాకా చైనా, రష్యా, అమెరికా మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది.
Also Read : Minister KTR : యుఎస్ లో కేటీఆర్ బిజీ